Wednesday, January 22, 2025

రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”

- Advertisement -
- Advertisement -

‘పలాస 1978’ లాంటి పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ తో అఖండ విజయం సాధించడమే కాక పలువురు చిత్ర ప్రముఖులు మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”లో యువ
నటుడు రక్షిత్ అట్లూరి హీరోగా, సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, నటుడు చరణ్ రాజ్ మరియు తమిళ నటుడు విద్యా సాగర్ ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో వెంకట సత్య
దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Rakshit Atluri Operation Raavan First Look‘నీ ఆలోచనలే నీ శత్రువులు’ అనే కాప్షన్ తో రక్షిత్ ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేఘా & ఒమేఘా విద్యా సంస్థల వైస్ చైర్ పర్సన్ శ్రీమతి మాలతి రెడ్డి గారు లాంచ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ లో ఉత్కంఠంగా హైవే, సిటీ మరియు ఇతర విజువల్స్ ఉండడం చిత్రం పై అంచనాలు కలిగిస్తుంది. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణంతర కార్యక్రమాలలో నిమగ్నమైపోయిన చిత్ర యూనిట్ నుండి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News