Monday, December 23, 2024

ఆకట్టుకుంటున్న ‘777 చార్లీ’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరైన కన్నడ యంగ్ హీరో ర‌క్షిత్ శెట్టి ప్రస్తుతం నటించిన చిత్రం ‘777 చార్లీ’.  తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. హీరోకి కుక్క‌తో ఏర్పడే ఎమోష‌న‌ల్ బాండింగ్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాటోగ్రఫి విజువ‌ల్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలు పెంచేసింది. కిర‌ణ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాకు నోబిన్ పాల్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ 10న ఈ చిత్రం క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కానుంది.

Rakshit Shetty’s ‘777 Charlie’ Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News