Monday, January 20, 2025

ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రకుల్

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో తెలియని వారు అంటూ ఉండరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కెరటం సినిమాలతో సినీ ప్రయాణం ప్రారంభించి సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. రకుల్ తన భాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారయి. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో గత కొన్ని రోజుల నుంచి ఆమె సహజీవనంలో ఉన్నారు. జాకీ భగ్నానీ జన్మదినం కావడంతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపింది. మీ జీవితంలో ప్రతీ రోజు అనుకున్నవి అన్నీ జరగాలని కోరుకుంటున్నానని, నీలాంటి అమాయకత్వం, దయ, నవ్వించే గుణం ఎవరిలో ఉండదేమోనని ప్రశంసించారు. 2009లో కల్ కిస్నే దేఖా సినిమాలో బాలీవుడ్‌లో జాకీ ప్రవేశించారు. జాకీ హీరో, నిర్మాత, వ్యాపార వేత్తగా రాణిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News