Thursday, January 23, 2025

ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్-భగ్నానీ వివాహం

- Advertisement -
- Advertisement -

గోవా: హీరోయిన్ రకుత్ ప్రీత్ సింగ్, సినీ నిర్మాత జాకీ భగ్నానీ ఘనంగా వివాహం చేసుకున్నారు. గోవాలోని ఓ రిసార్ట్‌లో పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట గత మూడేళ్ల నుంచి గాఢ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడ చిత్రం గిల్లీ సినిమాతో సినీ ఇండస్ట్రీలో రకుల్ ప్రవేశించారు. బాలీవుడ్‌లో ఒకే సంవత్సరం ఐదు చిత్రాల్లో నటించి హిందీ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె నటనతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ధృవ’,’సరైనోడు’,’ రారండోయ్ వేడుక చూద్దాం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘మన్మథుడు-2’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News