మన తెలంగాణ/సిటీ బ్యూరో: డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని సైబరాబాద్,టిజి న్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అనోహా బ్లెసిం గ్, అజీజ్, సత్యవెంకట గౌతం, మహ్మద్ మహబూ బ్ షరీప్, వరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 199గ్రాముల కొకైన్, రెండు పాస్‌పోర్టులు, రెండు బైక్‌లు, పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నా రు. డ్రగ్స్ విలువ రూ.35 లక్షలు ఉంటుంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సో మవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.నైజీరియన్ దేశానికి చెందిన మహిళ అనోహ బ్లెస్సింగ్ అలియాస్ జోనా అలియాస్ జో హేయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తోంది.వెస్ట్ ఆఫ్రికాకు చెందిన గుణిబీసా పాస్‌పోర్టుతో ఇండియాకు వచ్చింది.
2019 లో డ్రగ్స్ విక్రయిస్తుండగా ధూల్‌పేటలో ఎక్సైజ్ సి బ్బంది అరెస్టు చేశారు. నైజీరియా దేశానికి చెందిన అజీజ్ నోహీం అడేషోలా నిజాం కాలేజీలో డిగ్రీ చ దువుతు సన్‌సిటీలో ఉంటున్నాడు. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన బెంగళూరు లీడ్ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతం బెంగళూరులో ఉంటున్నాడు. 2020లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కెపిహెచ్‌బి పోలీసులు అరెస్టు చేశారు. ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన సా నబోయిన వరుణ్ కుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్, బండ్లగూడకు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో నేరాలు చేయడంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నైజీరియా దేశానికి చెందిన డివైన్ ఎబూకా సుజీ అలియాస్ లెబూకా అలియాస్ ఇమాన్యూయెల్ అలియాస్ లెవల్ ఢిల్లీ లో, ఎజియోనైజిలీ ఫ్రాంక్లిన్ ఉచెన్న అలియాస్ కా లేశి సన్ సిటీలో ఉండూవారు.
నైజీరియాకు చెంది ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఐదుగురు డ్రగ్స్ విక్రయించే నిందితులు హైదర్‌షాకోట్‌లోని జానాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో సమావేశం అ వుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీ య డగ్స్ నెట్‌వర్క్ నడిపిస్తున్న ప్రధాన నిందితుడు డివైన్ ఎబూకా సూజీ ఇండియా నుంచి నైజీరియా కు వెళ్లి అక్కడి నుంచి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నా డు. నైజీరియాకు చెందిన అనోహ బ్లెస్సింగ్ ను నకి లీ పాస్‌పోర్టుతో ఇండియాకు పలుమార్లు పంపిం చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. అనోహ బెంగళూరు ఉంటూ దేశవ్యాప్తంగా విమానం, రైలులో తిరుగుతూ డీలర్లకు కొకైన్‌ను సరఫరా చేస్తోంది. ఈ క్రమంలోనే అనోహ హైదరాబాద్‌కు 20సార్లు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఇలా తీసుకుని వచ్చిన అనోహ డ్రగ్స్‌ను డ్రగ్స్ డీలర్లకు విక్రయించింది. అనోహ నకిలీ పాస్‌పోర్టు తీసుకుని 2018లో ఇండియాకు వచ్చింది.
పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకునేందుకు నకిలీ పాస్‌పోర్టుతో తిరుగుతూ, ఇంటర్నేషనల్ సిమ్ కార్డులను వాడుతోంది, వాటి ద్వారానే వాట్సాప్‌లో సమాచారం చేరవేస్తోంది. నైజీరియా దేశానికి చెందిన అజీజ్ ఇండియాకు 2014లో స్టూడెంట్ వీసాపై వచ్చాడు, ఉస్మానియా యూనివర్సిటీకి నకిలీ డిడి సమర్పించిన కేసులో నిందితుడికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష పడింది. కాలేషీతో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. విశాఖపట్టణానికి చెందిన అల్లం సత్యవెంకట గౌతం బెంగళూరకు తరచూ వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. అక్కడ ఉంటున్న నైజీరియన్లతో స్నేహం పెంచుకున్నాడు, కాలేషీ, అజీజ్ వద్ద గ్రాముకు రూ.500 కమీషన్ తీసుకుని లోకల్ డీలర్లకు డ్రగ్స్ విక్రయించేందుకు సహకరించేవాడు. ఇప్పటి వరకు డ్రగ్స్ కమీషన్ నిందితుడికి రూ.13.24లక్షలు వచ్చాయి. గౌతం, వరుణ్ కుమార్ స్నేహితులు ఇద్దరు కలిసి నైజీరియన్ల వద్ద కొకైన్‌ను గ్రాముకు రూ.8,000 కొనుగోలు చేసి రూ.12,000లకు విక్రయిస్తున్నారు. ఇలా అందరు కలిసి ముఠాగా ఏర్పడి అవసరం ఉన్న వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు రమేష్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పట్టుకున్నారు.
డ్రగ్స్ తీసుకున్నది వీరే…
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 13మందిని పోలీసులు గుర్తించారు, ఇందులో వ్యాపారవేత్తలు, సీని ప్రముఖులు ఉన్నారు. ఇందులో సినీ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్ ,కిషన్ రాఠి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీచరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్‌ను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో 13మందిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో సినీ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్ ఉన్నాడు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడే మూత్రపరీక్ష నిర్వహించగా అనికేత్, ప్రసాద్, అమన్ ప్రీత్‌సింగ్, మధు, నిఖిల్‌కు పాజిటివ్ వచ్చింది.
పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారి ఏబుక సుజి పరారీలో ఉన్నాడని డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్ తీసుకోగా, ఐదుగురికి కొకైన్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. సినీ హీరో అమన్ ప్రీత్ సింగ్‌ను పరీక్షిస్తే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌ను ఇప్పటి వరకు డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని. పెడ్లర్‌గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని, ఎన్‌డిపిఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైనా నిందితుడేనని స్పష్టం చేశారు.