Friday, December 20, 2024

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. రకుల్ ఇంట్లో ఉండే పెంపుడు శునకం చనిపోవడంతో ఆమె అనుకొని సంఘటన జరిగిదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పెంపుడు కుక్కతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. శునకం పేరు బోస్లమ్, అది తన జీవితంలోకి వచ్చి 16 సంవత్సరాలు అవుతుందని పేర్కొంది. పెట్‌డాగ్ వచ్చినప్పటి నుంచి తాము సంతోషంగా ఉన్నామని వివరించింది. ఇద్దరు కలిసి పెరిగామని, ఎలాంటి బాధ లేకుండా వెళ్లిపోయావని, రెస్ట్ ఇన్ పీస్ అని, ఎక్కడున్న సంతోషంగా ఉండాలని రకుల్ పోస్టు షేర్ చేసింది. రకుల్ పోస్టుపై మంచు లక్ష్మి కామెంట్ చేశారు. బ్లోసమ్ మృతికి ఆమె సంతాపం తెలపడంతో పాటు రెస్ట్ ఇన్ పీస్ అని, రకుల్ తనకు తెలిసినప్పటి నుంచి బ్లోసమ్ కూడా తెలుసు అని స్పందించింది. రకుల్ ఫాలోవర్స్, సెలబ్రెటీలు, పలువులు ప్రముఖులు బ్లోసమ్ మృతికి సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News