Thursday, January 23, 2025

సమయం వచ్చినప్పుడు ఆ విషయంపై మాట్లాడతా

- Advertisement -
- Advertisement -

Rakul preet singh love with jackky bhagnani

చిత్రసీమలో మరో ప్రేమ కథ నడుస్తోంది. అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని మీడియా చిలువలు, పలువలుగా రాయకముందే రకుల్ బయటపట్టేసింది. మేమిద్దరం ప్రేమలో ఉన్నాం.. అని చెప్పేసింది. అప్పటి నుంచీ రకుల్ ఎప్పుడు, ఎక్కడ కనిపించినా… జాకీకి సంబంధించిన ప్రశ్నలు ఆమెకు ఎదురవుతున్నాయి. వీటికి సమాధానం చెప్పీ చెప్పీ రకుల్ కూడా విసిగిపోయి ఉంటుంది. అందుకే తాజాగా ఓ ఇంటర్వూలో “మా ప్రేమ కథ గురించి అడగొద్దు ప్లీజ్‌” అనేసింది. “ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది.

అమ్మ, నాన్న, తమ్ముడులానే జీవిత భాగస్వామి కూడా ఉంటాడు. దాని గురించి ప్రతిసారి మాట్లాడడం అనవసరం. ఎప్పుడూ ఇదే ప్రశ్న అడగొద్దు ప్లీజ్. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంపై నేనే మాట్లాడతాను. మా రిలేషన్ షిప్ గురించి ఏదైనా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రతి ఇంటర్వ్యూలో నా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా”అని చెప్పింది రకుల్. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది చివరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ఆ వార్తల సారాంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News