Sunday, November 3, 2024

రకుల్ ఇంట పెళ్లి సందడి షురూ..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ నెల 21న గోవాలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను నిర్వహించారు. భగ్నానీ ఇంట్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News