Monday, January 20, 2025

నాడు ప్రభాస్ సినిమాలో నన్ను తొలగించారు: రకుల్ ప్రీత్ సింగ్

- Advertisement -
- Advertisement -

ముంబై: రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ తొలి నాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. ఇతర నటులు, మోడల్స్ నుంచి తాను వేరుగా ఉంటుండే దానినన్నారు. 2011లో ప్రభాస్ తో ఓ సినిమా షూటింగ్ నాలుగు రోజు అయ్యాక నన్ను తొలగించి, కాజల్ అగర్వాల్ ను పెట్లుకున్నారని ఆమె ఫిలింఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అప్పట్లో నేను కాలేజ్ లో ద్వితీయ సంవత్సరం చదువుతుండేదాన్ని. ‘మిష్టర్ పర్ ఫెక్ట్’ అనే సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేశాను. తర్వాత ఢిల్లీకి వెళ్లాను. అప్పడు నన్ను తీసేసి కాజల్ ను పెట్టుకున్నారు. కారణం వారిద్దరి సినిమా అదే వారం విడుదలై విజయవంతం అయింది. దాంతో నిర్మాతలు మళ్లీ ఆ జంటతోనే సినిమా తీయాలనుకున్నారు. కొత్త అమ్మాయిల విషయంలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అని వివరించారు.

‘అప్పడు మీ మనస్సు విరిగిపోయిందా?’ అని అడిగినప్పుడు ‘లేదు, విషయం నాకు సరిగా తెలిసింది కాదు. నేను ఢిల్లీ వెళ్లిపోయాక వారు రెండో షెడ్యూల్ గురించి చెబుతామన్నారు. కానీ నేను ఢిల్లీ వెళ్లాక, వారు నా స్థానంలో వేరే వారిని పెట్టుకున్నారని తెలిసింది. దాంతో ఓకే…నాకింకేదో మంచి జరగాల్సి ఉందేమో అనుకున్నాను’’ అని తెలిపింది.

రకుల్ ప్రీత్ సింగ్ 2009 లో కన్నడ సినిమా ‘గిల్లీ’ తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. తర్వాత 2014లో  ‘యారియా’ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇటీవల కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్2’ లో నటించింది. ఇండియన్3 సీక్వెల్ లో కూడా నటించనున్నదని సమాచారం. ఇంకా హిందీలో ‘దే దే ప్యార్ దే 2’ లో కూడా నటించబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News