Monday, December 23, 2024

పెళ్లి గురించి చెప్పిన రకుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాల్సిందేనని నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ గాఢ ప్రేమలో ఉన్నారు. ఈ జంట ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై రకుల్ స్పందించారు. భాగస్వామని కలిగి ఉండటం సహజ ప్రక్రియ అని తెలిపారు. తాను ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరిగా కాలం వెళ్లదీశానని, జాకీ తన జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయిందన్నారు. సినీ పరిశ్రమలో ఉన్నవారిపై రకరకాల గాసిప్స్ వస్తాయన్నారు.

సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పూర్తిగా అర్ధం చేసుకుంటున్నాడని ఆమె చెప్పారు. జాకీ, తాను సినిమా, ఫిట్‌నెస్‌ ను ఎక్కువగా ఇష్టపడుతామని, రోజుకు 12 గంటలు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటామని, గంట మాత్రం కలిసి సమయం గడుపుతామని, అప్పుడు ఇద్దరు వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటామన్నారు. పది సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమలోకి వచ్చానని, సినిమాల గురించి తెలియకపోవడంతో మొదట్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియలేదన్నారు.

తొలి చిత్రానికి అదృష్టం కలిసి రావడంతో సినీ ప్రయాణం సంతృప్తినిచ్చిందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమాల్లో ఎక్కువగా నటించానని, మంచి కథ దొరికితే ఎక్కువ గంటలు పని చేయడంతో పాటు పారితోషికం గురించి ఎప్పుడు ఆలోచించలేదని రకుత్ తెలిపారు. 2013లో టాలీవుడ్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ఆమె నటించారు. గిల్లి కన్నడ సినిమాతో రకుల్ నటిగా సినిమాల్లోకి వచ్చారు. ఆమె నటిస్తున్న అయలాన్ సినిమా సంక్రాంతికి విడుదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News