Friday, November 22, 2024

రకుల్ కు మండింది… జవాబివ్వకుండా వెళ్లిపోయింది!

- Advertisement -
- Advertisement -

అబుధాబి: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమి(ఐఐఎఫ్ఏ) ఉత్సవం-2024 లో నటి రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది. అక్కడ ఆమె టెలివిజన్, ఓటిటి ప్లాట్ ఫామ్స్ గురించి కూడా ఆమె మాట్లాడింది. అయితే ఆమె మామ, నిర్మాత వశు భగ్నాని గత కొన్ని నెలలుగా డబ్బులు చెల్లించడం లేదన్న ఆరోపణలపై ప్రశ్నించినప్పుడు ఆమె జవాబివ్వకుండా వెళ్లిపోయింది.  వశు భగ్నాని పూజా ఎంటర్ టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ నడిపిస్తున్నాడు. తన సినిమాలోని వారికి అతడు డబ్బులు చెల్లించడం లేదని ఆరోపణ. వశు భగ్నాని తన సిబ్బందికి రూ. 65 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉందని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్ డబ్ల్యుఐసిఈ) అధ్యక్షుడు బిఎన్. తివారీ అన్నారు. ఆయన సినిమాలు- మిషన్ రాణిగంజ్, గణపత్, బడే మియా చోటే మియా ల్లో బిఎన్. తివారీ పనిచేశాడు.

‘‘మాకు మొదట టినూ దేశాయ్ నుంచి ఫిర్యాదు అందింది. మిషన్ రాణిగంజ్ సినిమా తాలూకు రూ. 33 లక్షలు ఆమెకు ఇంకా బాకీ ఉన్నారు. తర్వాత వశు భగ్నానీ చెల్లించేందుకు కొంత సమయం కావాలన్నారు. నెలలో చెల్లించేస్తానన్నారు. టినూ దేశాయ్ బాకీ ఇంకా అలాగే ఉంది. అలాగే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియా చోటే మియా సినిమాకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ కు డబ్బులు చెల్లించలేదన్న మరో ఫిర్యాదు ఉంది. అలీ జాఫర్ కు రూ. 7.5 కోట్లు రావాల్సి ఉందన్న ఫిర్యాదు అందింది. దర్శకుడు వికాస్ బహ్ల్ కు కూడా రూ. 2.5 కోట్లు ‘గణపత్’ సినిమాకు అందలేదన్న మరో ఫిర్యాదు ఉంది’’ అని బి.ఎన్. తివారీ తెలిపారు.

విశు భగ్నాని కూలీ నెం.1, హీరో నెం.1, ప్యార్ కియా తో డర్నా క్యా, బడే మియా చోటే మియా, బీవి నెం. 1, తేరే జాదూ చల్ గయా, ముఝే కుచ్ కెహనా హై, రెహనా హై తేరే దిల్ మే, దీవానాపన్ , ఓమ్ జై జగదీశ్ వంటి సినిమాలను తీశాడు.

‘‘ వశు సార్, చాలా మందికి డబ్బు ఇవ్వాల్సి ఉంది అని  అనేక మీడియా కథనాలు వస్తున్నాయి…’’ అని ఓ విలేకరి నటి రకుల్ ప్రీత్ ను అడుగుతుండగానే ‘‘సారీ’’ అంటూ వెళ్లిపోయింది. కాగా ఐఐఎఫ్ఏ ఉత్సవ్-2024కు రకుల్ ప్రీత్ సింగ్ పచ్చ బాడీకాన్ డ్రెస్ వేసుకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News