Monday, January 20, 2025

రాచకొండలో ర్యాలీలు నిషేధం

- Advertisement -
- Advertisement -

Rallies banned at Rachakonda Police Commissionerate

 

హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ర్యాలీలు, సభలపై నిషేధం విధించినట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. నేరెడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించే వారు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని అన్నారు. మారణాయుధాలు, రాళ్లు ఉండడం, జెండాలు, పేలుడు పదార్థాలు తరలించడం, పబ్లిక్ ప్లేస్‌లో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువ మంది గుంపులుగా చేరి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైకులు, లౌడ్ స్పీకర్ల మోత మోగించడంపై నిషేధించినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News