హైదరాబాద్ : తమిళనాడులో కూడా వ్యయసాయ రంగం అభివృద్ధికోసం తె లంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సం క్షేమ పథకాలను అమలు చేయలని ఆ రాష్ట్ర రైతు లు తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమిళ వ్యవసాయసంఘం అధ్వర్యంలో బుధవా రం వేలాదిమంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం ప్రత్యక శ్రద్దతో అమలు చే స్తున్న రైతుసంక్షేమ పథకాలు ఇక్కడి ప్రభుత్వం కూడా అమలు చేయాలని నినదించారు. రైతుల కు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, రైతుబం ధు , రైతుబీమా పథకాలు అమలు చేయాలని రై తులు డిమాండ్ చేశారు.కనీస మధ్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశా రు.అనంతరం బహిరంగసభ నిర్వహించారు. ముఖ్యఅతిధిగా దక్షిణభారత రైతుసంఘాల స మాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయు డు పాల్గొన్నారు.
తమిళవ్యవసాయ సంఘం అధ్య క్షుడు కె.ఎం.రామగౌండర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ ఈ రోజు దేశంలో రైతు ల పరిస్థితి అత్యంత దీనంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. యువకులకు వ్యవసాయం చేస్తున్నాడు అంటే పిల్లను కూడా ఇచ్చేపరిస్థితి లేదన్నారు. కారణం వ్యవసాయం లాభసాటిగా లేకపోవడమే అని, ప్రభుత్వాల చిన్న చూపు కారణంగా వ్యవసాయ రంగం కుదెలు అయ్యిందన్నారు. చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు క్ర మంగా తమ భూములను అమ్మేసుకుంటూ కూ లీలుగా మారిపోతున్నారని విచారం వెలిబుచ్చా రు. పెద్ద రైతుల పిల్లలు కూడా వ్యవసాయ రం గంలోకి రావడానికి ఇష్టపడడం లేదన్నారు. రా బోయే రోజులో దేశ వ్యవసాయ రంగం మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నియంత్రించి వినియోగదారులకు తక్కువ ధరలో సరుకులు అందించాల నె విధానాల కారణంగా రైతు దెబ్బ తింటున్నాడన్నారు.. పరిస్థితి అదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలకు తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
అందుకే తాము ఇటీవల అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో సిఏసిపి విధానాన్ని రద్దుచేసి దాని స్థానంలో రై తు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిం చే విధంగా ట్రిబినల్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభు త్వం గద్దెకెక్కిన రోజు 2014 లో ఇచ్చిన హామీ మేరకు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని, రెట్టింపు అయ్యిందా? ఖర్చు రె ట్టింపు అయ్యిందా? అని ప్రశ్నలు వేశారు. ఇం కొక వైపు తెలంగాణలో కేసిఆర్ నాయకత్వంలో రైతులకు అనేక పథకాలు అమలు చేయబడుతున్నాయని వెల్లడించారు. రైతుబందు పథకం ద్వా రా ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 10 వేల రూపాయల నగదు, ప్రతి రైతుకు ఉచిత జీవిత బీ మా ద్వారా 5 లక్షల రూపాయిలు, 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ప్రతి చేనుకు సాగునీటి సౌకర్యం కల్పించారని వివరించారు.పంటలు మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, ప్రతి రైతు తమ ఆడపిల్లల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం,
ప్రతి ముసలి రై తుకు 57 ఏళ్లు దాటితే రెండు వేల రూపాయ ల పెన్షన్ ఇస్తూ దేశంలో మరే రాష్ట్రంలో అమలు చే యని పథకాలు రైతులకు అమలు చేస్తూ దేశాని కి ఆదర్శంగా నిలుస్తున్నారని వెల్లడించారు. అం దుకే ఈరోజు ప్రతి రాష్ట్రంలో కెసిఆర్ తెలంగాణ మోడల్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిఆపరు. సిఎం పిలుపుమేరకు అబ్‌కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ‘2024 సంవత్స రం రాబో యే పార్లమెంటు ఎన్నికలలో కేం ద్రం లో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించి రైతు రా జ్యా న్ని స్థాపించడాని రైతులంతా ముందుకు రావాల్సిందిగా కోటపాటి నరసింహనాయుడు విజ్ణప్తిచేశారు.