Friday, November 22, 2024

చంద్రబాబు విడుదల కోరుతూ రైతుల ట్రాక్టర్ల ర్యాలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ నల్లొండ జిల్లా కోదాడ పట్టణంలో టిడిపి ఆధ్వర్యంలో రైతులు, కూలీలు భారీగా ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు. శుక్రవారం కోదాడలోని మెయిన్ రోడ్డు ద్వారా విష్ణురామ్ థియేటర్ నుండి స్థానిక ఆంజనేయస్వామి గుడి వరకు ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నల్గొండ పార్లమెంటు అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి మచ్చలేని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులు బనాయించి రోజుల తరబడి జైల్లో పెట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు. ఒక నియంత ఆలోచనలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కక్షసాధింపు రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులకు దిగి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ పై ప్రజలు తిరుగు బాటు చేసి ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, జైలుకు తరలింపును నిరసిస్తూ తమ పార్టీ చేస్తున్న ఆందోళనల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొంటున్నారన్నారు.

అనంతరం నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విధానాలతో ప్రజాస్వామ్య ప్రజాతంత్ర వాదులు ఖండిస్తున్నా వైఎస్ జగన్‌కు బుద్ధి రావటం లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు పై ఎన్ని కేసులు పెట్టినా బయటికి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ ఇన్‌చార్జీ మండల వెంకటేశ్వరావు కోదాడ పట్టణ అధ్యక్షుడు జనపనేని కృష్ణారావు, వేమూరి సురేష్, చిలుకూరు మండల పార్టీ అధ్యక్షులు సాతులూరి గురవయ్య, నడిగూడెం పార్టీ అధ్యక్షులు దొంతగాని శ్రీనివాసరావు, ఎర్ర జగదీష్ ,బండ్ల రమేష్ ,రామినేని లవ్ అయ్యా, మండల కోటయ్య, గౌన్ శ్రీనివాస్ గౌడ్, ఐ టిడిపి నాయకులు వివేక్ చింతల యాదయ్య, హరి పాల్గొన్నారు.

TDP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News