Monday, December 23, 2024

అంబేడ్కర్ విగ్రహం నుండి అమర జ్యోతి వరకు అమర వీరుల సంస్మరణ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం నుండి సచివాలయం వద్దనున్న అమరజ్యోతి వరకు అమర వీరుల సంస్కరణ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
5880 మంది కళాకారులు పాల్గొన్నారు.. ఒక్కో అంశాన్ని ఒక్కోరు కో ఆర్డినేట్ చేయగా ర్యాలీ సంబరంగా సాగింది. వివరాలు ఇవీ..
చందు యక్షగానంలో 300 మంది పాల్గొనగా కో ఆర్డినేటర్‌గా గడ్డం హిమగిరి వ్యవహరించారు. ఒగ్గుడోలు లో వెయ్యి మంది పాల్గొనగా సిహెచ్ రవి కుమార్ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. ఇక బోనాల కోలాటంలో 800 మంది పాల్గొనగా సిహెచ్ స్వప్న కో ఆర్డినేట్ చేశారు. కాటికాపరులు 50 మంది పాల్గొనగా వారిని బి.మల్లేష్ కో ఆర్డినేట్ చేశారు. బైండ్ల కళాకారులు వంద మంది పాల్గొనగా వారిని పులి యాదగిరి కో ఆర్డినేట్ చేయడం గమనార్హం. ఇక దుబ్బుల కళాకారులు వంద మంది పాల్గొనగా వారిని మాటూరి దేవేందర్ కో ఆర్డినేట్ చేశారు.

వీరితో పాటు కోలాటం, మహిళా డప్పులు, గొల్ల సుద్దులు, వీర ప్రభలు కలిపి 170 మంది పాల్గొనగా వారిని కృపాదానం కో ఆర్డినేట్ చేశారు. బోనాలు 80 మంది పాల్గొనగా పి. వాణి కో ఆర్దినేట్ చేశారు. డప్పులు వెయ్యి మంది పాల్గొనగా వి. శ్రీనివాస్ గౌడ్, బంజారా కళారూపాల్లో 400 మంది పాల్గొనగా ఎస్. విజయ శ్రీ, గుస్సాడీ నృత్యంలో వంద మంది పాల్గొనగా మిట్టు రవి కో ఆర్డినేట్ చేశారు. అలాగే కొమ్ము కోయలో వంద మంది పాల్గొనగా రమేష్ వారిని కో ఆర్డినేట్ చేశారు. రాజన్న డోలులో 40 మంది పాల్గొనగా ఎన్. నాగేశ్వర రావు వారిని కో ఆర్డినేట్ చేశారు. మహిళల బతుకమ్మ కార్యక్రమంలో వంద మంది పాల్గొనగా ఎస్. సునిత వారిని కో ఆర్డినేట్ చేశారు. వీటికి తోడు పులి వేశాలు 30 మంది వేయగా కె. ప్రసాద్ వారిని చూసుకున్నారు. కోలాటంలో 500 మంది పాల్గొనగా రేణుకాదేవీ వారిని కో ఆర్డినేట్ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో అమితంగా ఆకట్టుకునే చిరుతల భజన 180 మందితో నిర్వహించగా వారిని దినేష్ కో ఆర్డినేట్ చేశారు. మహిళా డప్పులు కార్యక్రమంలో 240 మంది పాల్గొనగా పి. అశ్విని వారిని కో ఆర్డినేట్ చేసింది. వీరితో పాటు బుడు బుక్కలు కార్యక్రమంలో 30 మంది పాల్గొనగా కోటేశ్ వారిని కో ఆర్డినేట్ చేశారు. తోలు బొమ్మలతో 20 మంది పాల్గొనగా కె. ప్రసాద్ వారిని కో ఆర్డినేట్ చేశారు. చెంచులు 30 మంది పాల్గొనగా సాయులు వారిని కో ఆర్డినేట్ చేశారు. మొహర్రం పీర్లు 15 మంది పట్టుకోగా , కాళికా వేశాలు మరో 15 మంది వేశారు. వీరిని జి. పెద్దులు వారిని కో ఆర్డినేట్ చేశారు. కోలాటంలో 40 మంది పాల్గొనగా గడ్డం సోమరాజు వారిని కో ఆర్డినేట్ చేశారు.

డప్పులతో 20 మంది పాల్గొనగా గడ్డం హరికృష్ణ, కోలాటంలో 40 మంది పాల్గొనగా రవళి వారిని కో ఆర్డినేట్ చేసింది. మహిళా డప్పులు 50 మంది పాల్గొనగా గడ్డం జమదగ్ని , ఇతర కోలాటంలో 50 మంది పాల్గొనగా ఎం రజిత వారిని కో ఆర్డినేట్ చేసింది. లంబాడీ నృత్యంలో వంద మంది పాల్గొనగా రాజశేఖర్ వారిని కో ఆర్డినేట్ చేశారు. లేడీస్ డప్పులు 50 మంది పాల్గొన్నారు. పేరిణిలో 20 మంది, కథక్‌లో 20 మంది, కూచిపూడిలో 20 మంది, భరతనాట్యంలో 20 మంది పాల్గొనగా వారిని ఇందిరాహేమ,ప్రశాంత్ తదితరులు కో ఆర్డినేట్ చేయడం విశేషం. మొత్తంగా 5,880 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News