Friday, December 20, 2024

రైతు దినోత్సవం.. మెదక్‌లో ట్రాక్టర్లతో ర్యాలీ

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రైతు దినోత్సవం సందర్భంగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి స్థానిక రైతు వేదిక వరకు పది ట్రాక్టర్లలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా 24 గంటల ఉచిత కరెంట్‌ను తెలంగాణ రాష్ట్రం రైతులకు అందిస్తుందని కొనియాడారు. ఈ ర్యాలీలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కమిషనర్ జానకిరామ్‌సాగర్, మెదక్ తహశీల్దార్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News