Wednesday, April 2, 2025

మొదటి పాట వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారి. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ జర్నీ ఏప్రిల్ 7న విడుదల కానున్న శర్వా, సంయుక్త నటించిన దర్శనమే అనే పాటతో ప్రారంభమవుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. సాంగ్ పోస్టర్ లో శర్వా, సంయుక్త రొమాంటిక్ బైక్ రైడ్ ఆస్వాదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News