Monday, December 23, 2024

రామ్ #BoyapatiRAPO మైసూర్ షెడ్యూల్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ #BoyapatiRAPO షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రబృందం ఈరోజు మైసూర్‌ లో చివరి షెడ్యూల్‌ ను ప్రారంభించింది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మైసూరు విమానాశ్రయంలో దిగిన రామ్, శ్రీలీల కాండీడ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ రామ్ ని రగ్డ్ లుక్‌ తో మాస్ క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ థండర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News