Saturday, December 21, 2024

నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రాంచంద్ర పౌడల్ ఎన్నిక..

- Advertisement -
- Advertisement -

కట్మండు: నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రాంచంద్ర పౌడల్ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్(మావోయిస్టు సెంటర్)తో సహా ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పౌడల్‌కు అనుకూలంగా పార్లమెంట్‌కు చెందిన 214 మంది సభ్యులు, ప్రాంతీయ అసెంబ్లీకి చందిన 352 మంది సభ్యులు ఓటు వేశారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచంద్ర పౌడల్‌కు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా అభినందనలు తెలియచేశారు. 2008లో నేపాల్ రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత జరిగిన మూడవ అధ్యక్ష ఎన్నిక ఇది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News