Friday, January 10, 2025

‘సర్కారోడు’గా చరణ్?

- Advertisement -
- Advertisement -

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల భారీ సినిమా RRRతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో ఇండియాస్ టాప్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. దీనితో ఈ సినిమాపై కూడా ఓ రేంజ్‌లో హైప్ ఉండగా దీని కోసం పాన్ ఇండియా వీక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి టైటిల్ ఏం పెట్టారు అనే దానిపై గత కొన్ని రోజులు క్రితం ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది, ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఉందని తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమాకి మాస్ టైటిల్ ‘సర్కారోడు’ అనే పేరును ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఆగస్టులో ఈ సినిమా టైటిల్‌పై ఓ క్లారిటీ రానుందట. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు తన బ్యానర్‌లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News