Thursday, January 23, 2025

చిరంజీవిని మరిపించేలా చరణ్ కనిపిస్తారు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ ఈనెల 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, హీరోయిన్ పూజాహెగ్డే, దర్శకుడు కొరటాల శివ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “ఆచార్య సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో చరణ్ అద్భుతంగా నటించాడు. ఇద్దరం కలిసి నటించడం నాకు మరచిపోలేని అనుభూతినిచ్చింది. మేమిద్దరం కలిసి నటించే ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పటికి వస్తుందో..? మళ్ళీ శివనే ఇలాంటి కథ తీసుకురావాలేమో అనిపిస్తుంది.

ఇక రామ్‌చరణ్ నటన గురించి చెప్పాలంటే… సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో మేమిద్దరం తొలిసారి కలిసిన వేళ ఓ భావోద్వేగపూరిత సన్నివేశం ఉంది. దానికి ఇద్దరం గ్లిజరిన్ ఉపయోగించలేదు. గ్లిజరిన్ వాడకుండా చరణ్ నాకు కన్నీళ్ళు తెప్పించేలా నటించాడు. చరణ్ నటుడిగా ఎంతో ఎదిగాడని అర్థమైన క్షణమది. చరణ్ నటనను చూసి తండ్రిగా, నటుడిగా చాలా గర్వంగా అనిపించింది. ఇక రామ్‌చరణ్ చేసిన సిద్ధ పాత్రకు హీరోలందరూ న్యాయం చేస్తారు. అందులో సందేహం లేదు. కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు. ఒకవేళ చరణ్‌కు ఈ పాత్ర చేయడం కుదరలేకపోతే మాత్రం బెస్ట్ ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్. ఇక పాటల విషయానికొస్తే… ‘నాటు నాటు’ సాంగ్ ప్రొమో వచ్చాక ‘భలే భలే బంజారా’ సాంగ్ షూట్ చేశాం. అప్పుడు మాత్రం కొంచెం టెన్షన్‌గా అనిపించింది.

శేఖర్ మాస్టర్ ఎలాంటి స్టెప్పులిస్తాడా అని ఎదురు చూశా. ఇక పాటలో దిగాక నేనే బాగా చేసినా… ఫైనల్‌గా చరణ్‌కే మార్కులు పడతాయి”అని అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “సెట్‌లోకి నేను తెల్ల కాగితంలా అడుగుపెడతా. దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ కథ, పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకున్నా. నాన్నతో కలిసి నటించడం ఒత్తిడిగా అనిపించినా ఒళ్లు దగ్గర పెట్టుకొని నటించాను. ‘ఆచార్య’ నా సినిమా కాదు… మెగాస్టార్ చిరంజీవిది. నేను ఇందులో అతిథిని మాత్రమే. నాన్నతో కలిసి 20 రోజులు ఈ సినిమా చేయడంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నా”అని తెలిపారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ “చిరంజీవి నటన వేరే లెవెల్‌లో ఉంటుంది. తెరపై ఆయన ఉంటే కళ్లు మరొకరిపై ఉండవు. మారేడుమిల్లిలో ఒక సీన్ తీసిన తర్వాత మాకున్న భయమంతా పోయింది. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిని మరిపించేలా చరణ్ కనిపిస్తారు”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News