Thursday, January 23, 2025

రామ్ చరణ్- కీర్తి సురేష్ నాటు డ్యాన్స్.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్ లక్ సఖీ’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. జనవరి 28న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే, ఈవెంట్ లో చరణ్- కీర్తి సురేష్ చేసిన నాటు డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. తనతో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సూపర్ హిట్ సాంగ్ స్టెప్ చేయమని కీర్తి అడిగింది. దీంతో కీర్తితో కలిసి రామ్ చరణ్ నాటు స్టెప్ వేశాడు. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కాగా, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన ‘గుడ్ లక్ సఖీ’ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Ram Charan and Keerthi Suresh dance video viral

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News