Monday, December 23, 2024

తండ్రైన రాంచరణ్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాంచర్‌ణ్ తండ్రయ్యాడు. రాంచరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం రాత్రి పురటి నొప్పులు రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి జన్మించడంతో మెగా కుటుంబం సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాంచరణ్-ఉపాసన దంపతులకు మెగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

Also Read: పైసలు పోయినా.. పంట బతకాలె

2012లో ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నామని రాంచరణ్-ఉపాసన డిసెంబరు 12న వెల్లడించారు. ఉపాసన సీమంత వేడుక అంగరంగా వైభవంగా మెగా కుటుంబ సభ్యులు చేశారు. ఇప్పటివరకు వేరు కాపురం పెట్టామని పిల్లలు పుట్టిన తరువాత అత్తమామలతో కలిసి ఉంటామని ఉపాసన తెలిపారు. తమ ఎదుగుదలలో నానమ్మ-తాత కీలక పాత్ర పోషించారని, వాళ్లతో వచ్చే ఆనందాన్ని తన పిల్లలకు దూరం చేయాలని తనకు లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News