Wednesday, April 9, 2025

బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్, ఉపాసన..

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. డైరెక్టర్ బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతి ఇచ్చారు. ఇటీవల రామ్ చరణ్ 40వ బర్త్ డే వేడుకలను ఆయన భార్య ఉపాసన ఘనంగా నిర్వహించారు. పలువురు సెలబ్రెటీలను ఆహ్వానించి.. గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చరణ్ బర్తడ్ సందర్భంగా బుచ్చిబాబుకు ఉపాసన గిఫ్ట్ పంపించారు. జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఆంజనేయస్వామి పాదుకలను బహుమతిగా పంపారు. ఈ గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వారు పంపిన గిఫ్ట్ ను షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పారు బుచ్చిబాబు.

కాగా, బుచ్చిబాబు.. రామ్ చరణ్ తో పెద్ది అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ఫస్ట్ షూట్ పేరుతో ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, చరణ్ కు జోడీగా నటిస్తుండగా.. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News