Sunday, January 5, 2025

ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చరణ్, ఉపాసన..

- Advertisement -
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామారాజు పాత్రలో అద్భతంగా నటించిన చరణ్.. తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఆనయతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అందరూ హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉంటే.. రామ్ చరణ్ మాత్రం నేషనల్ వైడ్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఏంటంటే.. కొద్దిరోజులుగా చరణ్.. తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ దంపతులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు. ఈ సందర్భంగా షిండే వారిని సత్కరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై సైలీష్ లుక్ లో కనిపించి వావ్ అనిపించారు.

ఈ పిక్ లో ఉపాసన సోఫాలో కూర్చోగా, రామ్ చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియార అద్వానీ జంటగా నటిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News