Sunday, January 5, 2025

రామ్ చరణ్, ఉపాసనల కూతురు క్లింకార ఫోటోలు వైరల్!

- Advertisement -
- Advertisement -

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఈ ఏడాది జూన్ 20న కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆమెకు క్లింకార అని పేరు పెట్టిన రామ్ చరణ్ దంపతులు.. అప్పటినుంచి తన కుమార్తెను కెమెరాల కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కి రామ్ చరణ్ దంపతులు ముంబయికి వెళ్లారు. తమ వెంట కూతుర్ని కూడా తీసుకెళ్లారు. ఫోటోగ్రాఫర్లు వెంటపడటంతో కూతురు మొహం కనిపించకుండా రామ్ చరణ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఉపాసన తమ పెంపుడు కుక్క రైమ్ ను ఎత్తుకోగా, క్లింకారను రామ్ చరణ్ ఎత్తుకుని ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా ఉపాసనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News