Friday, April 4, 2025

మరో ఆస్కార్ విన్నర్‌తో చరణ్ మూవీ

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌గా స్టార్ దర్శకుడు శంకర్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కన్నా ముందు చరణ్ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు సంగీతాన్ని అందించిన ఎంఎం. కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా చరణ్ మరో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.

రెహమాన్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్టు తెలిసింది. తరువాత చరణ్… దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహమాన్ దాదాపుగా ఖరారైన్నట్టేనని తెలిసింది. మొత్తానికి అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చే సినిమా పాటలు ప్రేక్షకులను అలరించడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News