Monday, December 23, 2024

ఫ్యాషన్ ఐకాన్..

- Advertisement -
- Advertisement -

ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకధీరుడు రాజమౌళి సహా సినిమా యూనిట్‌ను అందరూ ప్రశంసించారు. ఈ అవార్డుల ఫంక్షన్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ తరుణంలో అభిమానులు, ప్రేక్షకులు రెడ్ కార్పెట్‌పై మన సెలబ్రిటీలు ఎంత స్టైలిష్ లుక్స్‌తో మెప్పించారనే విషయాన్ని ఆసక్తిగా గమనించారు.

ఇండియాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలాని డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధరించి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో మన ఇండియన్ స్టైల్‌ను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లారు చరణ్. ఆ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌గా తనదైన గుర్తింపును దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News