సినిమా తర్వాత ఇండియాలో అంత ఎక్కువగా కేజ్ ఉంది స్పోర్ట్స్‌లో క్రికెట్ కే. ప్రపంచ క్రికెట్‌లో దూసుకుపోతుంది టీమిండియా. అయినప్పటికీ 2023 జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయింది. వరల్డ్ కప్ ఓటమి ఇప్పటికీ ప్రతి భారతీయుడికి మింగుడు పడని విషయం. మెల్బోర్న్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ వరల్డ్ కప్‌ను డిస్‌ప్లేలో పెట్టారు నిర్వాహకులు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఆర్ట్ అండ్ కల్చర్ విభాగానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంబాసీడర్‌గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ వరల్డ్ కప్ 2023 ట్రోఫీతో కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
2023లో ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిన తరువాత కప్‌ను టచ్ చేసిన ఓన్లీ ఇండియన్ సెలబ్రిటీగా రామ్ చరణ్ నిలిచాడు. కొందరు అభిమానులు మాత్రం 2027లో ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్ సాధిస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశా రు. రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలో సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మరొక పక్క బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆర్‌సి16 కోసం చరణ్ సన్నద్ధం అవుతున్నాడు.