Saturday, March 22, 2025

బర్త్ డే రోజున టైటిల్, ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న సినిమాకి పెద్ది అనే టైటిల్ అనుకుంటున్నారు అని చాలా కాలంగా ప్రచారం ఉంది. కానీ ఈ టైటిల్ పాన్ ఇండియాకి సూట్ అవుతుందా అని సందేహంతో నిర్మాతలు ఇన్నాళ్లూ ఆగారు. అయితే ఇప్పుడు అదే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఆ టైటిల్ ని ప్రకటిస్తారు అని సమాచారం. ఇప్పటికే టైటిల్ టీజర్‌కి సంబంధించి పనులు ఊపందుకున్నాయని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. పెద్ది అనేది పేరు.

గ్రామీణ ప్రాంతంలో అలాంటి పేర్లు ఉంటాయి. పేరు కాబట్టి ఏ భాషలోనైనా ఒకటే ఉంటుంది, పాన్ ఇండియాకి ఇది సూట్ అవుతుంది అని ఫిక్స్ చేశారట. సినిమాలో హీరో రామ్ చరణ్ పాత్ర పేరు ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. కబడ్డీ ప్రధానంగా సాగే ఈ కథలో రామ్ చరణ్ ఆటగాడిగా కనిపిస్తాడు. చరణ్ ఈ సినిమా కోసం బరువు పెరిగి, బాడీ పెంచాడు. గడ్డం, మీసాలు ఫుల్లుగా పెంచాడు. ఈ నెల 27న రామ్ చరణ్ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల అవుతాయని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News