ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వింటేజ్ స్పోర్ట్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉగాది కానుకగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఇక గురువారం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న రామ్‌చరణ్‌కు అనేకమంది సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు.
ఇక తాజాగా చరణ్ బర్త్ డే వేడుకలకి సంబంధించిన ఫొటోలు బయటకి వచ్చాయి. చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. తనకి ఈ మార్చి 27 ఎప్పటికీ సంతోషకరమైన రోజని ఆమె ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఇక షేర్ చేసిన ఓ ఫొటోలో చిరంజీవి, సురేఖ, సుస్మితలతో రామ్ చరణ్, ఉపాసన కలిసి ఉన్నారు. మరో ఫొటోలో చిరంజీవి, నాగార్జునలతో పాటు స్నేహితులు, సన్నిహితులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు.