Monday, December 23, 2024

గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్..

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే వేడుకలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగా యి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ పార్టీలో ప్రముఖ నటీనటులు, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ బర్త్ డే వేడుకను రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన హోస్ట్ చేశారు.

ఈ వేడుకలో అక్కినేని నాగార్జున, అ మల, నాగచైతన్య, అఖిల్, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, ఆయన సతీమణి మిహిక, ఎస్.ఎస్.రాజమౌళి, కీరవాణి, డివివి దానయ్య, సుకుమార్, ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ, అడివి శేష్, నిఖిల్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, కృష్ణ వంశీ, అల్లు అరవింద్, దిల్‌రాజు, సెంథిల్ కుమార్, ఎస్.ఎస్. కార్తికేయ, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News