Sunday, January 5, 2025

‘పెద్ది’గా రామ్ చరణ్?

- Advertisement -
- Advertisement -

గ్ల్లో్లబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో భారీ సినిమా గేమ్ ఛేంజర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానాతో చరణ్ కెరీర్ 16వ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా కథ సంథింగ్ స్పెషల్‌గా ఉంటుందట. ఈ కథ విన్న సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సైతం మైండ్ బ్లాక్ అయిందట. ఈ చిత్రానికి ‘పెద్ది’ ఆసక్తికరమైన టైటిల్ పెట్టనున్నారని తెలిసింది. ఈ టైటిల్‌పై అధికారిక క్లారిటీ త్వరలో రానుందట. ఇక ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News