Saturday, December 21, 2024

థాంక్యూ మిస్టర్ సి

- Advertisement -
- Advertisement -

Ram Charan going on vacation with his wife Upasana

 

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీ హీరోగా మారిపోయాడు. తాజాగా సినిమా షూటింగ్‌ల నుండి విరామం తీసుకున్న చరణ్ ఎట్టకేలకు వెకేషన్‌కి భార్య ఉపాసనతో వెళ్తున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ఒక ఫోటోను కొణిదెల ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. రామ్‌చరణ్ మాస్క్ పెట్టుకొని ఉండగా ఉపాసన చిరు నవ్వులు చిందిస్తోంది. రెండేళ్ల తర్వాత వెకేషన్‌కి అని… థాంక్యూ మిస్టర్ సి అని చెప్పింది ఉపాసన. ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇక రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో సైతం రామ్‌చరణ్ ఆచార్య చిత్రంలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News