Monday, December 23, 2024

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో రామ్‌చరణ్‌ను అవమానించారు

- Advertisement -
- Advertisement -

జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. ప్రీ వెడింగ్ వేడుక మూడు రోజుల పాటు జరగడంతో దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు హాజరై ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ నటులు, నటీమణులు మొత్తం అంబానీ జరిపిన వేడుకలలో కనిపించారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. రామ్ చరణ్‌ను బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ అవమానించిన విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్ వెలుగులోకి తీసుకొచ్చింది. బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ హీరోల రేంజ్ బాలీవుడ్‌కు పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్‌చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ బాలీవుడ్ రేంజ్‌కు ఎదిగారు.

Ram Charan insulted in Anant Ambani pre-wedding

ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు అనే సాంగ్‌కు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్‌టిఆర్ పాన్ ఇండియా హీరోలుగా రికార్డులు సృష్టించారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో నాటు నాటు అనే సాంగ్‌కు సల్మాన్-షారూక్, అమిర్ ఖాన్‌లతో కలిసి రామ్ చరణ్ డ్యాన్స్ చేశారు. రామ్ చరణ్‌ను స్టేజీపైకి పిలిచే క్రమంలో చరణ్‌ను ఇడ్లీ-వడ అని షారూక్ సంభోదించారు. ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్ అక్కడే ఉన్నారు, ఆ మాట అనడంతో అక్కడి నుంచి ఆమె కోపంతో వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో మెగా అభిమానులు షారూక్ ఖాన్ తీరుపై మండిపడుతున్నారు. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌కు ఎదగడంతో వాళ్లు లోపల కుళ్లు పెరిగిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను వడాపావ్, భేల్ పూరి అనే పిలిస్తే ఊరుకుంటారా? అని మెగా అభిమానులు చురకలంటించారు.

Ram Charan insulted in Anant Ambani pre-wedding

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News