హైదరాబాద్: చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ను సోమవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ… ”చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా బ్లడ్, ఐ బ్యాంకులో ఉన్న నిల్వల గురించి తెలుసుకొని సాయం పొందొచ్చు. డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సైట్ లో మీకు ఏ టైంలో ఏ రోజు రావాలనుకుంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వెయిట్ చేయనవసరం లేదు. ఎవరికైనా రక్త దానం, నేత్ర దానం కావాలన్నా ఇందులో రిక్వెస్ట్ పెడితే మేము వెంటనే స్పందిస్తాం. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంక్ మాత్రమే ఉంది. త్వరలో మిగిలిన అన్ని ఆర్గాన్స్ కి డొనేట్ చేసేలాగా అవయవ దానం కూడా మొదలు పెడతాం. ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో ఈ వెబ్ సైట్ లభ్యమవుతుంది. దేశమంతటా కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్స్ బ్రాంచ్ లు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నాం” అని తెలిపారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజలకు సహాయపడ్డారు.
Megapower Star @AlwaysRamCharan launched 'Chiranjeevi Charitable Trust' and MegaStar @KChiruTweets's Website at #ChiranjeeviCharitableTrust pic.twitter.com/xfZqpfQYLZ
— BA Raju's Team (@baraju_SuperHit) October 18, 2021
Ram Charan launched Chiranjeevi Charitable Trust Website