Monday, December 23, 2024

యూఎస్‌కు రాంచరణ్‌…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12న అమెరికాలో ఘనంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ స్టార్ హీరో రాంచరణ్‌ అమెరికాకు వెళ్లాడు. అయితే ఈవెంట్ జరిగేందుకు ఇంకా 20 రోజుల సమయం ఉండగానే రాంచరణ్‌ ముందుగానే బయలుదేరారు. అసలు విషయమేంటంటే అమెరికాలోని ‘ద బీవర్లీ విల్ షైర్’ హోటల్‌లో ఫిబ్రవరి 24 నుంచి జరుగునున్న ఆరవ వార్షిక హెచ్‌సిఏ ఫిల్మ్‌ అవార్డ్స్ లో పాల్గొనేందుకు వెళ్లాడు రాంచరణ్‌. ఎస్‌ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో  వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా హెచ్‌సిఏ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2023 ఫైనల్‌ నామినేషన్స్‌ లో ఉత్తమ యాక్షన్‌ సినిమా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో చోటు సంపాదించుకోవడం విశేషం.

రాంచరణ్‌ హెచ్‌సిఏ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2023కు ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. రాంచరణ్‌కు హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్ కు ప్రజెంటర్‌గా వ్యవహరించే అవకాశం రావడం అత్యంత అరుదైన గౌరవమనే చెప్పాలి! రాంచరణ్‌ మార్చి 12న జరుగబోయే ఆస్కార్ ఈవెంట్‌ మొదలయ్యే వరకు యూఎస్‌లోనే ఉంటాడా?… లేదంటే ఇండియాకు తిరిగొచ్చి మళ్ళీ వెళ్తాడా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News