గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చే స్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్పో ర్ట్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు బు చ్చిబాబు సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ తా జాగా పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కన్నడ స్టార్ హీ రో శివ రాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇప్పటి కే హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఆర్సీ16 మూవీ తదుపరి షెడ్యూల్ కోసం ఢిల్లీ వె ళ్లనున్నట్టు తెలిసింది. ఢిల్లీలో జామా మసీదుతో పా టూ మరికొన్ని ప్రదేశాల్లో సినిమాలోని కీలక సీన్స్ ను తెరకెక్కించనున్నారట.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను గురువారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భం గా ప్రకటించడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నా రు. ఇదివరకే టీజర్ కట్ కూడా అయిందని, టీజర్ నెక్స్ లెవెల్ లో ఉం దని అంటున్నారు. సినిమాలో చ రణ్ ఎలా కనిపిస్తాడా? అతని లుక్ ఎలా ఉం టుందా అని చూడ్డానికి మెగా ఫ్యాన్స్‌తో పాటూ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు ముందు నుంచి పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నార ని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి.