Monday, January 20, 2025

జాతీయ అవార్డ్ మూవీ డైరెక్టర్‌తో సినిమా

- Advertisement -
- Advertisement -

Ram Charan next film with Gowtam Tinnanuri?

‘జెర్సీ’ అనే జాతీయ అవార్డ్ సినిమా తీయడంతో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు ఒక్కసారిగా మార్మోగిన సంగతి తెలిసిందే. తొలి చిత్ర దర్శకుడిగా అతడు తన సినిమాతో అరుదైన గౌరవం అందుకున్నాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు హిందీలోను రీమేకైంది. ఇందులో నటించిన నానీకి నటుడిగా గొప్ప పేరొచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు గౌతమ్. ఇంతకుముందే ప్రాజెక్ట్ ఖరారైంది. అయితే మెగాస్టార్ చిరంజీవికి గౌతమ్ తిన్ననూరి వినిపించిన కథ ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మెగా క్యాంప్ నుండి వచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఇంకా లైన్‌లోనే ఉందని, త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌ని చాలా సంతోషానికి గురి చేస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ‘ఆర్‌సి15’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది.

Ram Charan next film with Gowtam Tinnanuri?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News