Monday, December 23, 2024

బిగ్ పాన్ ఇండియా మూవీ ‘సి.ఈ.ఓ’?

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో రామ్‌చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం (ఆర్‌సి15) రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు సినిమా టైటిల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానుల ఆరాటం. తొలుత ఈ చిత్రానికి ‘సర్కారోడు’ అనే టైటిల్ వినిపించింది.

ఇప్పుడు ఆర్‌సీ15కు సంబంధించి మరో టైటిల్ నెట్టింట వైరల్ అవుతోంది. అదే.. ‘సి.ఈ.ఓ’ (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్). పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఈ టైటిల్ అయితే అన్ని భాషల వారికి సులభంగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ టైటిల్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న టైటిళ్లలో ‘సి.ఇ.ఓ’ కీలకంగా ఉందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికకగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘ఆస్కార్’ హడావిడిలో ఉన్నారు. ఈ నెల 12న జరగనున్న ‘ఆస్కార్’ వేడుక కోసం ఈ స్టార్ హీరో అమెరికాలో వెళ్లిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News