Sunday, January 5, 2025

ఫాదర్స్‌ డే స్పెషల్.. క్లీంకారతో రామ్‌చరణ్

- Advertisement -
- Advertisement -

ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని టాలీవుడ్ హీరోలు సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ ఫొటోలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ఫాదర్స్‌ డే విషెస్‌ తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన కూతురు క్లీంకారతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

‘ప్రతి బిడ్డకు నాన్నే తొలి హీరో’ అంటూ గతంలో తన తండ్రితో కలిసి దిగిన స్టిల్‌ను చిరంజీవి షేర్‌ చేశారు. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేశారు. నాగచైతన్య కూడా తన తండ్రి నాగార్జునతో కలిసి బాల్యంలో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. దానికి ‘ది ఓజీ’ అని క్యాప్షన్‌ పెట్టారు. వీరితోపాటు మరికొంతమంది సెలబ్రిటీలు స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Ram Charan Shares his daughter Klin Kaara Photo

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News