Sunday, December 22, 2024

యుద్ద వీరులకు నివాళులర్పించిన రామ్‌చరణ్..

- Advertisement -
- Advertisement -

Ram Charan speech at Azadi ka Amrit Mahotsav

మనతెలంగాణ/హైదరాబాద్: మనం నడిచే నేల, పీల్చే గాలి, బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుందని.. వీరుల త్యాగాలను ఎవరూ మరచిపోవద్దని నటుడు రామ్‌చరణ్ అన్నారు. శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో సికింద్రాబాద్-పరేడ్ గ్రౌండ్‌లో డిఫెన్స్ అధికారులు నిర్వహించిన యుద్థవీరుల నివాళుల కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్యఅతిథిగా హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉంది. దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం మన అదృష్టం. మనం ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే కారణం. సైనికుల ధైర్యం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే అన్నారు. కార్యక్రమంలో డిఫెన్స్ అధికారులు, ఉమెన్స్ రైట్స్ ప్రోటాక్షన్ కమిషన్ రామకృష్ణరావు, పలు స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు.

Ram Charan speech at Azadi ka Amrit Mahotsav

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News