Wednesday, January 22, 2025

మంచి ఫీల్ ఉన్న చిత్రం

- Advertisement -
- Advertisement -

Ram Charan Speech at 'Ori Devuda' Pre Release

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్త్తున్నారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా ఈనెల 21న విడుదల చేస్తున్నారు. రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. “వెంకటేష్ అన్న కోసమైనా ఈ చిత్రం చూస్తాను. మిథిలా పాల్కర్‌కు నేను, నా భార్య అభిమానులం. ఆమె ఓటీటీ సూపర్ స్టార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లీగల్లీలో విశ్వక్ సేనుడి గురించి తెలియని వారులేరు. ఆయనకు అంతటా అభిమానులున్నారు. కానీ ఆయన బయట ఉండే పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని. మంచి ఫీల్ ఉన్న చిత్రమిది” అని అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ “వెంకటేష్ ఈ సినిమాలో దేవుడి పాత్ర చేశారు. అశ్వత్ అద్భుతమైన కథ రాశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది ఈ చిత్రం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక, డైరెక్టర్ అశ్వత్, మిథిలా పార్కర్, లియో జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.

Ram Charan Speech at ‘Ori Devuda’ Pre Release

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News