Sunday, January 5, 2025

పిఠాపురంలో బాబాయికి మద్దతుగా రామ్‌చరణ్

- Advertisement -
- Advertisement -

మెగా కుటుంబం ఏపి రాజకీయాల్లో సందడి చేస్తోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న జనసేన పార్టీ అభ్యర్ధి సినినటుడు పవన్‌కళ్యాణ్‌కు ఎన్నికల్లో మద్దతుగా శనివారం మెగా కుటుంబ సభ్యులు పీఠాపురం చేరుకున్నారు.రామ్ చరణ్ ఇదివరకే ఒక ప్రకటన ద్వారా తన బాబాయికి మద్దతు ప్రకటించారు. రామ్ చరణ్ తన తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్ తో కలిసి హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరం చేరారు.

అక్కడినుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను చూడడం కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు .అడుగడుగున రామ్ చరణ్ కు అభిమానులు ఘనస్వాగతం తెలిపారు. పిఠాపురంలో రామ్ చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పోటెత్తిన అభిమాన గణానికి రామ్ చరణ్ అభివాదం చేశారు. కేంద్రమాజీ మంత్రి చిరంజీవికూడా తన సోదరుడు పవన్‌కు ఒక ప్రకటన ద్వారా మద్దతు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News