Wednesday, January 22, 2025

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకకు చరణ్..

- Advertisement -
- Advertisement -

 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం అవారులను సైతం సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు సాంగ్.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయింది.

ఇక త్వరలో లాస్‌ఏంజిల్స్‌లో జరుగనున్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఎస్‌ఎస్ రాజమౌళి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ లోగో ఉన్న బ్లాక్ కలర్ రాయల్ సూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఫొటోను రామ్‌చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ అవార్డుల వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంటుందని దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News