Sunday, January 19, 2025

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ లోని ఈ మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహంతో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తుండడం విశేషం. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వర్గాలు ఇప్పటికే రామ్ చరణ్ తో ఫొటో షూట్ కూడా నిర్వహించాయి. మరి కొన్నిరోజుల్లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనిపై రామ్ చరణ్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో తాను కూడా భాగం కావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News