- Advertisement -
వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీస్ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో వర్మ విచారణకు హాజరయ్యారు. గత నవంబర్ లో మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంపై టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు హాజరు కావాలని వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే, నవంబర్ 19, 25న విచారణకు ఆర్జీవీ గైర్హాజరయ్యారు. ఆ తర్వాత హైకోర్టుకెళ్ళి.. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని వర్మను హైకోర్టు ఆదేశించింది.
- Advertisement -