Saturday, January 4, 2025

రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం ఫకీలారెడ్డి ఆధ్వర్యంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా షకీలా రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా బురద జల్లుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి రాంగోపాల్ వర్మ చేత ఏపి సీఎం జగన్ అండతో ‘వ్యూహం’ పేరిట ఒక చెత్త సినిమాను నిర్మించారని మండిపడ్డారు. రాంగోపాల్ వర్మ ఒక సైకో అని అతడిని మించిన మరో సైకో జగన్ అని ఈ ఇద్దరు పిచ్చివాళ్లు కలిసి ఒక పిచ్చి కథను తయారు చేసి సినిమాగా ప్రజల మీదకు వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయాలనుకుంటే జగన్‌పై తీయాలన్నారు. తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డంపెట్టుకొని రూ.43వేల కోట్లు అడ్డంగా ప్రజల నుంచి ఏవిధంగా దోచుకున్నాడనే అంశం మీద,

కోడికత్తి డ్రామా పైనా, బాబాయిని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన అంశంమీద, తాను చంపి అదే నేరాన్ని చంద్రబాబుపై నెట్టి ఊరూరా అబద్ధపు ప్రచారం చేసి ప్రజల సానుభూతి పొంది ఓట్లు సంపాదించిన విధానంపైనా రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తే బావుంటుందన్నారు. వర్మపై పిచ్చివాడనే ముద్ర వేసి అతడితో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రావటం లేదని షకిలా రెడ్డి ఆరోపించారు. అటువంటి వ్యక్తిని పిలిపించుకొని తాను ఓ గొప్ప దేశభక్తుడినని చూపించుకుంటూ జగన్ ఓ సినిమా తీయించుకున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాళ్లు ప్రమీల, సూర్యదేవర ఝాన్సి, కృష్ణ వేణి, ప్రధాన కార్యదర్శులు దాసరి మాల్యావతి, తాళికోట ఆశాబిందు, కార్యాలయ కార్యదర్శి ఉప్పల శాంతి, కార్యనిర్వహక కార్యదర్శి తగిరిశ లలిత, కార్యదర్శులు సురేఖ, సుధారాణి, మహిళా నాయకురాలు విజయలక్ష్మీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News