- Advertisement -
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో ముంబై కోర్టు గురువారం నాడు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఫిర్యాదీ దారుకు రూ. 3.72 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. అంధేరీ కోర్టు శిక్ష విధించిన విషయం పై వివరణ ఇచ్చారు. అతడు తన మాజీ ఉద్యోగి అని ఇది 7 ఏళ్లక్రితం కేసు అని తెలిపారు. అప్పట్లో 2.38 లక్షల రూపాయల చెక్కు బౌన్స్ అయిందని తెలిపారు. దీనిపై తన తరుపున న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారని అన్నారు.అందువల్ల తాను ఇక ఏమీ చెప్పలేరని తెలిపారు. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
- Advertisement -