Monday, December 23, 2024

‘వ్యూహం’ రెండో టీజర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రియతమ జననేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘వ్యూహం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టీజర్, పోస్టర్స్ విడుదల చేశారు. ఇవాళ రెండో టీజర్ విడుదల చేశారు.

కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడిగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’ అని,  ఆ నాయకుడే వైయస్‌ జగన్‌ అని ఇప్పటికే వర్మ తెలిపారు. రెండో టీజర్‌లో నాయకునిగా జగన్ ఎదిగిన క్రమాన్ని చూపించారు. ‘నిజం తన షూ లెస్ కట్టుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది’ అని జగన్ ఆవేదన చెందిన సందర్భాన్ని చూపించారు.

వైయస్ కుటుంబంలో జరిగిన పరిస్థితులతో పాటు ప్రత్యర్థి రాజకీయ శిబిరాల్లో జరిగిన వ్యూహాలను కూడా ‘వ్యూహం’లో రామ్ గోపాల్ వర్మ చూపించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ‘ఎప్పుడో ఒకప్పుడు మీరు కల్యాణ్ (పవన్ కల్యాణ్)ను కూడా వెన్నుపోటు పొడుస్తారుగా’ అని అడిగితే ‘వాడికి అంత సీన్ లేదు. తనని తానే పొడుచుకుంటాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చూపించారు.

‘వ్యూహం’ చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తి అయ్యిందని, అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News